హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో రెండు రోజులు నీటి సరఫరా బంద్!

HYD: నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్-2లో మరమ్మతులతో OCT 5న ఉ.6 నుంచి 6న సా.6 గంటల వరకు సరఫరా నిలిచిపోనుందని జలమండలి తెలిపింది. సికింద్రాబాద్, CNT, ఉప్పల్, తార్నాక, నల్లకుంట, మేకలమండీ పరిసరాలు, ఇటు ఆదిభట్ల, బాలాపూర్, బార్కాస్, శంషాబాద్, బిన్ రెడ్డి నగర్, వనస్థలిపురం ఏరియాలు ఎఫెక్ట్ అవుతాయి.