హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమెరికాలో హన్మకొండవాసి మృతి

HNK: అమెరికాలో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్న హనుమకొండకు చెందిన బశ్వంత్ సూదుల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటనతో స్వస్థలమైన హనుమకొండలో విషాదం నెలకొంది. బశ్వంత్ మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అక్కడి స్థానిక సంఘాలు అండగా నిలిచి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి.