హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమెరికాలో మరిపెడ యువతి దుర్మరణం

MHBD: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ.రాత్రి రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే కారును ట్రక్ ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితురాలు తీవ్రంగా గాయపడ్డారు.