హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుగ్గారం ఎస్సైగా శ్రీకాంత్ బాధ్యతలు

JGL: బుగ్గారం పోలీస్ స్టేషన్ నూతన  ఎస్సైగా ఎస్. శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పోలీస్ శాఖలో చేపట్టిన బదిలీలు, పోస్టింగ్‌లలో భాగంగా ఆయనను బుగ్గారం పోలీస్ స్టేషన్ ఎస్సైగా నియమించారు. ఈ మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. మండలంలో ఎలాంటి అసంఖ్యాక కార్యక్రమాలకు చోటు లేదన్నారు.