హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికుల సౌకర్యానికి మరో ముందడుగు

KRNL: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రోటరీ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు అన్నారు. కర్నూలు, మంత్రాలయం ఆర్టీసీ బస్టేషన్లకు రోటరీ క్లబ్ రెండు వీల్‌చైర్లను అందజేసింది. వీల్‌చైర్లు దివ్యాంగులు, వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.