హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాద మృతులు వరంగల్ జిల్లా వాసులు

SDPT: కోహెడ మండలం శంకర్‌నగర్ స్టేజీ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే మృతి చెందినవారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన చెంచు రాజు, కొయ్యాల శ్రీనివాస్‌గా గుర్తించారు. మొక్కల లోడుతో లారీలో శంకర్‌నగర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వచ్చారు. లారీని రోడ్డు పక్కన నిలిపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.