హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

NLG: పర్యావరణ సమతుల్యతకు వన్యప్రాణులు కీలకమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫారెస్ట్ అధికారులు సూచించారు. జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలు, సాగర్, చండూరు, దేవరకొండ అటవీ ప్రాంతాల్లో కృష్ణజింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. విద్యుత్ తీగలు, వేట, మానవ తప్పిదాలతో వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నందున వాటిని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.