భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నవజాత శిశువుల అత్యవసర చికిత్స వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. భారీ శబ్దంతో సిమెంట్ ప్లాస్టరింగ్ కూలిపడగా, ఘటన సమయంలో అక్కడ శిశువులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రి భవనాల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని రోగుల బంధువులు కోరారు.
తెలంగాణ
ఆస్పత్రిలో భారీ శబ్దంతో ఊడిన పైకప్పు పెచ్చులు


