హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

AKP: విశాఖ జిల్లాలోని డిగ్రీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇవ్వనుండగా, విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో తరగతులు నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 94925 69177 నంబరు‌ను సంప్రదించాలని డైరెక్టర్ కె. రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.