హైదరాబాద్: 28°C
తెలంగాణ

పందిళ్లపల్లికి భారీగా చేరుకున్న యూరియా

KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్‌ పాయింట్‌కు శనివారం 2,639 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరింది. డీఏవో ధనసరి పుల్లయ్య వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు 1,339, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 700, సీఆర్పీకి 100 టన్నులు కేటాయించారు. లోడును మార్క్‌ఫెడ్‌, ప్రైవేటు దుకాణాలకు వెంటనే పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.