KMM: కల్లూరు మండలం పెద్దకొరుకొండి -వెన్నవల్లి మధ్య ఉన్న గుట్ట వద్ద సొరంగం పనులు జరుగుతుండగా, మట్టి చరియలు విరిగిపడి ప్రోక్లెన్ ఆపరేటర్ రవి మృతి చెందాడు. శనివారం రాత్రి ఈ ఘటన జరగడంతో సుమారు 10 గంటలు రెస్క్యూ బృందం శ్రమించి మట్టి చరియలను తొలిగించి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీస్, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
మట్టి చరియలు విరిగిపడి ప్రోక్లెన్ ఆపరేటర్ మృతి


