హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

MHBD: వన్యప్రాణుల వారోత్సవాలను పురస్కరించుకొని గూడూరు మండలం భీముని పాదం జలపాతం వద్ద ఆదివారం అటవిశాఖ అధికారులు పర్యాటకులకు అవగాహన కల్పించారు. వన్య ప్రాణుల సంరక్షణతో జీవవైవిధ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. వన్య ప్రాణులకు హాని కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.