KMR: పిట్లం మండలం చిల్లర్గి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం రాత్రి ఓ దూడపై చిరుత దాడి చేసి, పూర్తిగా చంపి తినేసింది. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులు దూడ కళేబరాన్ని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారంతో పశువులు, రైతుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
చిల్లర్గి శివారులో దూడపై చిరుత దాడి


