ADB: జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో కార్యక్రమం రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అర్జీదారులు గమనించి సహకరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
తెలంగాణ
రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్


