హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 12 నుంచి వాలీబాల్ క్రీడాపోటీలు

ASF: జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి మండలాల యువతకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 12-14 తేదీ వరకు జైనూర్‌లో వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జైనూర్ సీఐ రమేష్ తెలిపారు. ఆసక్తి కలిగిన ఆయా మండలాల క్రీడాకారులు మండల పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడా పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.