హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాయి ప్లాస్టిక్స్‌గోదాంలో అగ్ని ప్రమాదం

WGL: ఏనుమాములలోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్న సాయి ప్లాస్టిక్స్‌ గోదాంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.