SRD: నాగలగిద్ద వద్ద శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి నారాయణఖేడ్‌కు తరలిస్తున్న బియ్యాన్ని ఆటోలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆటోతో పాటు బియ్యాన్ని సీజ్ చేసి నారాయణఖేడ్‌కు తరలించారు. సీజ్ చేసిన బియ్యం సుమారు ఏడు క్వింటాళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
నాగలగిద్ద వద్ద రేషన్ బియ్యం పట్టివేత


