భూపాలపల్లి జిల్లాలో వాతావరణం విచిత్రంగా మారుతోంది. పలు ప్రాంతాల్లో ఉదయం చలితో కూడిన దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. తెల్లవారుజామున చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. మధ్యాహ్నం భానుడు భగభగమంటూ ఎండ తీవ్రత కనిపిస్తోంది. దీంతో ప్రజలు వేడిమితో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
తెలంగాణ
ఉదయం గజగజ.. మధ్యాహ్నం భగభగ


