హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్‌లో 11.341 టీఎంసీల నీటి నిల్వ

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1399.98 అడుగులుగా నమోదైందని AEE సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.341 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో నిల్ కాగా, ప్రధాన కాలువ ద్వారా 1,846 క్యూసెక్కులు, ఆవిరి ద్వారా 192 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,038 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.