GNTR: బ్రాడీపేటకు చెందిన ఇమాంబీ (69) ప్రమాదవశాత్తు శౌచాలయంలో జారిపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 29న ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు శౌచాలయానికి వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు జారిపడ్డారు. కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శౌచాలయంలో జారిపడి వృద్ధురాలి మృతి


