హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత వైద్య శిబిరం

NGKL: శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇవాళ అచ్చంపేట మండలంలోని చెన్నారం కమ్యూనిటీ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని స్థానిక సమితి ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.