హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందుబాబులకు అడ్డాగా లేక్ వ్యూ భవనం

ఆసిఫాబాద్ మండలం ఆడ గ్రామంలో పర్యాటకుల కోసం నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్ భవనం నిరుపయోగంగా మారింది. రూ.లక్షల ప్రజాధనంతో నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదని స్థానికులు తెలిపారు. రాత్రివేళల్లో మందుబాబులకు అడ్డాగా మారిందని, ప్రాంగణంలో ఖాళీ బీర్ సీసాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. భవనాన్ని వెంటనే వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.