హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో డివైడర్‌ను ఢీకొన్న కారు

కడప జిల్లా బద్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డులో ఆదివారం కారు డివైడర్‌ను ఢీకొంది. టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి చెన్నైకి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు ముందు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం.