హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో పెరిగిన విద్యుత్ డిమాండ్!

HYD: ఎల్‌నినో ప్రభావంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అక్టోబర్‌లోనూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెలలో సాధారణంగా డిమాండ్ తగ్గాలి. కానీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఏకంగా 1,500 మెగావాట్లు పెరిగింది. డిమాండ్ ఇదేవిధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో పరిశ్రమలకు కోతలు తప్పవనే సంకేతాలను ఇస్తున్నారు.