హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నర్సింగాపూర్‌లో అక్రమ మట్టి తవ్వకాలు'

PDPL: నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో రహదారి పనుల కోసం జేసీబీతో మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నర్సింగాపూర్–కీచులాటపల్లి రహదారి పనులకు మట్టి తరలిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల సమీపంలో తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.