హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ సిటిజన్స్‌ను అభినందించిన కలెక్టర్

HNK: వయోవృద్ధుల సంక్షేమం, సామాజిక సేవలో విశేష కృషికి హనుమకొండ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించింది. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రతినిధులు అవార్డును స్వీకరించారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ను కలిసి మెమొంటో అందజేశారు.