హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో 5న ఉద్యోగ ఇంటర్వ్యూలు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, టీఎస్‌కేసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5న ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థల్లో పురుషులు, మహిళలకు ఉద్యోగావకాశాలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నెలకు రూ.19,288 వేతనంతో పాటు అలవెన్సులు అందజేస్తారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.