హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ సలహానే మా విజయానికి కారణం: హోప్‌

భారత్‌పై మూడో వన్డేలో వెస్టిండీస్‌ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కెప్టెన్‌ షై హోప్‌ కీలక పాత్ర పోషించాడు. 143 బంతుల్లో అజేయంగా 162 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా మాజీ భారత కెప్టెన్‌ MS ధోనీ ఇచ్చిన సలహా తనకు ఎంతో ఉపయోగపడిందని హోప్‌ తెలిపాడు. ఫలితంపై కాకుండా ప్రక్రియపై దృష్టిపెట్టాలని ధోనీ సూచించినట్లు చెప్పాడు.