హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

HYD: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో యూసఫ్‌గూడకు చెందిన నవీన్‌ అనే వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించి రూ.29.84 లక్షలు కాజేశారు. SM ద్వారా వాట్సాప్ గ్రూపులో చేరిన నవీన్‌కు కొందరు తమను స్టాక్ మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకున్నారు. లాభాలు వస్తాయని నమ్మించి పలు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయించారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.