హైదరాబాద్: 28°C
వ్యాపారం

7 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సగటున 7 శాతం పెరిగాయి. HYD, బెంగళూరు, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్, ఢిల్లీ, పుణె, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 12% వార్షిక వృద్ధి నమోదైంది. నిర్మాణ వ్యయాలు పెరగడం, డెవలపర్లు విలాసవంతమైన ప్రాజెక్టులపై దృష్టి సారించడం ఇందుకు కారణాలని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ తెలిపింది.