హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌ వలలో యువత..పెరుగుతున్న మత్తు పరీక్షలు!

HYDలో డ్రగ్స్‌ వినియోగం పై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. జనవరి నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు 2 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 754 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 44 శాతం మంది విద్యార్థులు, 32 శాతం మంది ఐటీ నిపుణులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి, మత్తుబిళ్లలు, సింథటిక్‌ డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగం పై తనిఖీ చేశారు.