హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన తీగజాతి మొక్కలు

జగిత్యాల బస్టాండ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ తీగజాతి మొక్కలు భారీగా అల్లుకున్నాయి. అవి ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు విద్యుత్ తీగల వరకు విస్తరించడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మొక్కలను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.