హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుట్టు మిషన్లకు 3,792 దరఖాస్తులు

MLG: వెనుకబడిన తరగతుల మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి జిల్లాలో భారీ స్పందన లభించింది. నియోజకవర్గానికి వెయ్యి మిషన్లు లక్ష్యంగా పెట్టుకోగా, జిల్లా వ్యాప్తంగా 3,792 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపూర్‌లో అత్యధికంగా 589, ములుగులో 506, మంగపేటలో 456 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.