హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేక్‌లు, శాలువాలు వద్దు: మాజీ మంత్రి

WNP: వ్యవసాయ సంక్షోభం, రైతుల కష్టాలు, ప్రజల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను హంగూ ఆర్భాటాలు లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కేక్ కటింగ్‌లు, శాలువాలు, పూలమాలలు తీసుకురావద్దని పార్టీ శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు.