హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచినీటి క్యాన్‌లో బల్లి.. కూలీలకు అస్వస్థత

KMM: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహపురంలోని ఓ పరిశ్రమలో శనివారం 9 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజన సమయంలో క్యానులోని మంచినీరు తాగిన అనంతరం అందులో బల్లి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అస్వస్థతకు గురైన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో అందరూ క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.