హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు ప్రమాదకరంగా ధర్మసత్రం

JGL: కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లే మార్గంలోని 40 ఏళ్ల మారుతీ నిలయం ధర్మసత్రం శిథిలావస్థకు చేరింది. భవనం పునాదులు దెబ్బతినడంతో ప్రమాదకరంగా మారింది. గోడలు తడిసి చెట్లు పెరగడంతో పాటు పైపుల లీకేజీ కారణంగా గోడలు, స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయి. మొదటి అంతస్తులోని గదులకు తాళాలు వేసినా భవనాన్ని తొలగించకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.