హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగులు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య

KMM: కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నేలకొండపల్లికి చెందిన గుడిబోయిన గోపయ్య(61) కడుపు నొప్పి భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగాడు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతిని కుమారుడు వీరబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.