హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రత్యేక అలంకరణలో సంగమేశ్వర స్వామి

SRD: ​ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ఆదివారం అర్చకులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి మహా మంగళహారతి పూజలు జరిపి, శ్రద్ధాభక్తులతో నైవేద్యం సమర్పించారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.