హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ చోరీ..!

WGL: సంగెం మండలం మొండ్రాయిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.లక్ష విలువైన కంప్యూటర్‌ చోరీకి గురైంది. పాఠశాలకు తాళాలు వేసి వెళ్లగా, శనివారం కంప్యూటర్‌ గది తాళం పగులగొట్టి ఉండటాన్ని స్వీపర్‌ గుర్తించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయ ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.