హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

GDWL: కేటీదొడ్డి మండలం కొండాపురంలో రూ.1.05 కోట్లతో పంచాయతీ, మహిళా సమైక్య, ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.