హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోయిల్‌సాగర్‌ కాలువకు సాగునీరు

NRPT: రాకొండ, పూసల్‌పహాడ్ గ్రామాల రైతుల విజ్ఞప్తిపై స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి తక్షణమే స్పందించారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డితో కలిసి ఆమె ఇరిగేషన్ అధికారులతో సాగునీటి సమస్యపై చర్చించారు. చర్చల అనంతరం కోయిల్ సాగర్ కుడి కాలువ ద్వారా శనివారం సాయంత్రం సాగునీటిని విడుదల చేయించారు. నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.