హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్లతో సమావేశం నిర్వహించిన ఎస్సై

ASR: ఇంట్లో ఆడవాళ్లు అయిన అక్క, చెల్లి, తల్లిని ఎలా గౌరవిస్తామో, బయట మహిళలను కూడా అలానే గౌరవించాలని సీలేరు పోలీస్ స్టేషన్‌ ఎస్సై ఎండీ యాసిన్ సూచించారు. శనివారం సాయంత్రం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని సూచించారు.