హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల అర్ధనగ్న నిరసన

నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు 18 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పదోన్నతులు, పేస్కేల్‌, కారుణ్య నియామకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల మండల అధ్యక్షుడు అత్తర్ భాష కోరారు.