హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పల్లె నిద్రలో పాల్గొన్న సీఐ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త బైపురెడ్డిపాలెంలో పల్లె నిద్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ షేక్ గఫూర్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు గురించి పోలీసులకు తెలియజేయాలని కోరారు.