కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.15.27 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శనివారం కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం శంకుస్థాపన చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


