హైదరాబాద్: 28°C
తెలంగాణ

దారుణం.. మిర్చి నారుపై గడ్డిమందు పిచికారీ

MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం శివారులో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి నారుపై గడ్డిమందు పిచికారీ చేయడంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని రైతు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 471/16లో 8.5 ఎకరాలకు సరిపడా పెంచిన నారు తీసేందుకు అక్టోబర్ 3న వెళ్లగా ఎండిపోయి కనిపించడంతో రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.