MNCL: హాజీపూర్ మండలం కర్ణమామిడి శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు పేకాట ఆడుతుండగా రాజు, సంపత్, శేఖర్, మహారాజును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. రమేశ్, రాజేశ్ పరారయ్యారు. నిందితుల నుంచి రూ.2 వేల నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్


