ములుగు మండలం అబ్బాపురం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై ఎస్.వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని, ముఖ్య కూడళ్లలో వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని, వాటి వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తెలంగాణ
సీసీ కెమెరాలపై పోలీసుల అవగాహన


