BDK: భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల శ్రేష్ట శనివారం వృద్ధులు, దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు, కంప్యూటర్ నైపుణ్యాలపై సూచనలు చేశారు. బ్రిడ్జ్ పాయింట్ ఆటో స్టాండ్‌ను పరిశీలించి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారానికి సబ్ కలెక్టర్ హామీ


