SRCL: ఎగువ మానేరు నీటిని వెంటనే విడుదల చేయాలని శనివారం గంభీరావుపేటలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వరి నిండు పొట్ట దశలో ఉన్నాయని, నీరు అందకపోతే రైతులు నష్టపోతారని మండల అధ్యక్షుడు కోడె రమేశ్ అన్నారు. సిద్దిపేట-కామారెడ్డి రహదారిపై రైతులతో కలిసి నిరసన తెలిపారు. రేపటిలోగా నీరు విడుదల చేయకపోతే తూములు బద్దలు కొడతామని హెచ్చరించారు.
తెలంగాణ
పంటలకు నీరు ఇవ్వాలని బీజేపీ రాస్తారోకో


